'అడ్డగూడూరు సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా'
BHNG: అడ్డగూడూరు మండలం కంచనపల్లి గ్రామంలో ఇవాళ గ్రామ సర్పంచ్ చెడే అంబేద్కర్ ఆధ్వర్యంలో గ్రామంలోని రోడ్ల ఇరుపక్కల ఉన్న కంపచెట్లను జేసీబీ సహాయంతో తొలగించారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ మాట్లాడుతూ... గ్రామంలో ఉన్న సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ సిబ్బంది, వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు.