VIDEO: పలు అభివృద్ధి పనులకు శ్రీకారం
VZM: రామభద్రపురం మండలం రొంపల్లి గ్రామంలో ఇవాళ అభివృద్ధి పనులను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, ఎమ్మెల్యే బేబీనాయన, జనసేన ఇన్‌ఛార్జి గిరడ అప్పలస్వామి పాల్గొన్నారు. గ్రామాభివృద్ధికి ఉపయోగపడే పలు పనులకు శంకుస్థాపనలు చేసి ప్రజలతో మాట్లాడారు. స్థానిక సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు.