విజయ్‌కు బిగ్ షాక్.. రోడ్ షోకు నో పర్మిషన్
తమిళగ వెట్రి కళగం అధినేత విజయ్‌కు పుదుచ్చేరిలో చేదు అనుభవం ఎదురైంది. అక్కడ తన బలం నిరూపించుకుందామని ఈనెల 5న ప్లాన్ చేసిన రోడ్ షోకు పోలీసులు పర్మిషన్ నిరాకరించారు. కరూర్ తొక్కిసలాట ఘటన దృష్ట్యా భద్రత కల్పించలేమని, కావాలంటే బహిరంగ సభ పెట్టుకోవచ్చని డీజీపీ ఆఫీస్ తేల్చిచెప్పింది. ఎన్ఆర్ కాంగ్రెస్, బీజేపీ సర్కార్ ఆంక్షలతో విజయ్ టూర్‌పై ఉత్కంఠ నెలకొంది.