తెనాలిలో కొనసాగుతున్న మహిళా ఉద్యోగి నిరసన

GNTR: తెనాలిలోని BSNL కార్యాలయం వద్ద మహిళా ఉద్యోగిని పద్మావతి చేపట్టిన నిరసన 4వరోజు గురువారం కూడా కొనసాగుతోంది. కస్టమర్ సర్వీస్ సెంటర్‌ను ప్రైవేటు ఏజెన్సీకి అప్పగించడాన్ని నిరసిస్తూ సోమవారం నుంచి రోడ్డుపైనే బైఠాయించి నిరాహారదీక్ష చేస్తున్నారు. కార్యాలయ అధికారులు, జిల్లా ఉన్నతాధికారులు దీక్ష విరమించమని కోరినప్పటికీ, ప్రైవేటీకరణ రద్దు చేయాలని ఆమె కోరారు.