ప్రతి రైతుకు యూరియా పంపిణీ చేస్తాం: కలెక్టర్

ప్రతి రైతుకు యూరియా పంపిణీ చేస్తాం: కలెక్టర్

BPT: జిల్లాలో పంటలు వేసిన ప్రతి రైతుకు యూరియా పంపిణీ చేస్తామని కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ తెలిపారు. జిల్లాలో యూరియా పంపిణీ, రైతు సేవా కేంద్రాల వివరాలు ముందుగానే రైతులకు సిబ్బంది తెలియజేయాలన్నారు. మంగళవారం జిల్లాలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో RSKలు, PACS 27 కేంద్రాల ద్వారా 465.700 మెట్రిక్ టన్నుల యూరియాను 4,236 మంది రైతులకు పంపిణీ చేశారని చెప్పారు.