భీమారం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో వన్ టైం సెటిల్మెంట్

MNCL: భీమారం మండల కేంద్రంలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో గతంలో రుణాలు తీసుకుని చెల్లించని మొండి బకాయి దారులు రిన్ సమాధాన్ - వన్ టైం సెటిల్మెంట్ పథకాన్ని వినియోగించుకుని రుణవిముక్తులు కావాలని భీమారం శాఖ కార్యనిర్వహణ అధికారి జి.సుబ్బారెడ్డి తెలిపారు. ఈ వన్ టైం సెటిల్మెంట్ పథకం ఈ నెల 31 వరకు పొడిగించబడిందని తెలిపారు.