పారిశుధ్యంపై కౌన్సిలర్ ఆగ్రహం

పారిశుధ్యంపై కౌన్సిలర్ ఆగ్రహం

కృష్ణా: ఇబ్రహీంపట్నం 21వ డివిజన్‌లో పారిశుధ్యం అస్తవ్యస్తంగా ఉందని, సీసీ రోడ్డు నిర్మాణం వీధి లైట్ల సమస్యలు పరిష్కారం కావడం లేదని శనివారం కౌన్సిలర్ జల్లి జ్యోతి అధికార పార్టీపై తీవ్ర విమర్శలు చేశారు. మున్సిపాలిటీ రాష్ట్రంలో మొదటి స్థానంలో ఉందని ఎలా చెప్పుకుంటామని ప్రశ్నించారు. సమావేశంలో ఆమె పారిశుధ్య దుస్థితిని ప్లకార్డుతో చూపించి నిరసన తెలిపారు.