ఇప్పటికైనా వైసీపీ తీరు మార్చుకోవాలి: కొండపల్లి

ఇప్పటికైనా వైసీపీ తీరు మార్చుకోవాలి: కొండపల్లి

AP: భోగాపురం విమానాశ్రయం క్రెడిట్ చోరీకి వైసీపీ చూస్తోందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ విమర్శించారు. అశోక్ గజపతిరాజు హయాంలోనే 2,600 ఎకరాల భూసేకరణ జరిగిందని, వైసీపీ కేవలం 300 ఎకరాలే సేకరించి నిర్వాసితులకు అన్యాయం చేసిందని మండిపడ్డారు. 'ఎర్రబస్సు రాని చోట ఎయిర్‌బస్ ఎందుకు' అన్న జగన్ మాటలను ప్రజలు మర్చిపోలేదని, ఇప్పటికైనా వైసీపీ తీరు మార్చుకోవాలని ఆయన హితవు పలికారు.