హామీల అమలులో కూటమి వైఫల్యం: CPI
W.G: సూపర్ సిక్స్ హామీలు అమలు చేయడంలో కూటమి ప్రభుత్వం వైఫల్యం చెందిందని సీపీఐ లిబరేషన్ పార్టీ నాయకులు టి.అప్పలస్వామి విమర్శించారు. పార్టీ 57వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఇవాళ తణుకులో పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు. రాష్ట్రంలో అభివృద్ధి, సంపద సృష్టి, సంక్షేమం తెస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన కూటమి అభివృద్ధికి ఆమడదూరంలో ఉందని ఆరోపించారు.