'దళితులకు కార్పొరేషన్ రుణాలు ఇప్పించాలి'

SRD: అర్హులైన దళిత యువకులకు కార్పొరేషన్ రుణాలు ఇప్పించాలని కేవీపీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మాణిక్ డిమాండ్ చేశారు. మల్కాపూర్ లో గురువారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రుణాలు ఇవ్వకుండా దళిత నిరుద్యోగులను ప్రభుత్వం మోసం చేస్తుందని విమర్శించారు. సమావేశంలో జిల్లా కార్యదర్శి అశోక్, ఉపాధ్యక్షులు శివకుమార్ పాల్గొన్నారు.