'ముఠా కార్మికులకు సమగ్ర చట్టం చేయాలి'

అనకాపల్లి జిల్లా ముఠా కార్మిక సంఘం జిల్లా మహాసభ మంగళవారం అచ్చుతాపురంలో జరిగింది. సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్.శంకరరావు మాట్లాడుతూ.. ఎన్నికల్లో ఇచ్చిన హామీల ప్రకారం ముఠా కార్మికులకు సమగ్ర చట్టం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. స్థానిక పరిశ్రమల్లో ముఠా కార్మికులకు ఉపాధి కల్పించాలని, వారికి ఈఎస్ఐ, పీఎఫ్ సౌకర్యాలు అందించాలని కోరారు.