అమలాపురంలో బాలిక కిడ్నాప్ కలకలం
AP: కోనసీమ జిల్లా అమలాపురంలో బాలిక కిడ్నాప్ కలకలం రేపింది. ఓ యువకుడు ఐమాండ్స్ పాఠశాల నుంచి కముజు నిషిత(10) అనే బాలికను అపహరించాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. కిడ్నాప్ చేసిన వ్యక్తి నిషితకు దూరపు బంధువైన మట్టపర్తి సత్యమూర్తి(చంటి)గా గుర్తించారు. నిషిత కోసం పోలీసులు బృందాలుగా ఏర్పడి ముమ్మరంగా గాలిస్తున్నారు.