VIDEO: భయభ్రాంతులకు గురి చేస్తున్న కోతులు
AKP: దమ్ముంటే పట్టుకోండి, పట్టుకుంటే వదిలేస్తా నర్సీపట్నం అనే చందంగా కోతులు అధికారులకు సవాలు విసురుతున్నాయి. మున్సిపాలిటీ ఆర్డీవో కార్యాలయంలో శనివారం వానరాలు సందర్శకులను భయభ్రాంతులకు గురిచేశాయి. ప్రతి వీధిలో కోతులు బీభత్సం సృష్టిస్తున్నాయి. ప్రభుత్వ కార్యాలయాలు, గృహాలు ఇలా వేటిని వదలడం లేదు. అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.