వార్డులో చెత్త తొలగింపు పనులకు చర్యలు

వార్డులో చెత్త తొలగింపు పనులకు చర్యలు

ATP: తాడిపత్రి పట్టణంలో 30 వార్డు భగత్ సింగ్ నగర్‌లో గత కొన్ని రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకు వార్డులలో నీరు నిల్వ ఉండి దోమలు ఎక్కువ అవుతున్నాయని ప్రజలు వాపోయారు. దోమల నివారణ కోసం కౌన్సిలర్ మల్లికార్జున స్ప్రేయింగ్, బ్లీచింగ్ పౌడర్‌‌ను చేయించారు. అలాగే డ్రైనేజీ బ్లాక్ అవడంతో దాంట్లో ఉన్న చెత్తను తొలగించారు.