దేశంలోనే తొలి LED క్రెడిట్ కార్డు!

దేశంలోనే తొలి LED క్రెడిట్ కార్డు!

క్రెడిట్ కార్డు రంగంలో సరికొత్త విప్లవం మొదలైంది! చెక్ ప్లాట్‌ఫాం, ఏయూ బ్యాంక్ కలిసి దేశంలోనే తొలి LED కార్డును లాంచ్ చేశాయి. ఈ కార్డు ప్రత్యేకత ఏమిటంటే, POS యంత్రాల ద్వారా చెల్లింపులు చేసినప్పుడు కార్డుపై ఉన్న LED లైట్ వెలుగుతుంది. ఏప్రిల్ 28 నుంచి చెక్ యాప్‌లో దీని కోసం అప్లై చేసుకోవచ్చు. దీనికి బ్యాటరీ అవసరం లేదు NFC ఫీల్డ్ ద్వారానే ఇది పనిచేస్తుంది.