అయ్యప్ప శోభాయాత్ర ఘనంగా నిర్వహణ

అయ్యప్ప శోభాయాత్ర ఘనంగా నిర్వహణ

NGKL: జిల్లాలోని స్థానిక శ్రీ సీతారామస్వామి దేవస్థానం నుండి కలశం, అయ్యప్ప స్వామి విగ్రహం, తిరు ఆభరణాలతో అయ్యప్ప శోభాయాత్ర ఘనంగా నిర్వహించారు. మేళతాళాల నడుమ పట్టణ పురవీధుల్లో సాగిన ఊరేగింపు భక్తులను ఆకట్టుకుంది. అనంతరం శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప సన్నిధానం వరకు భజనలు, కోలాటాలు, నృత్యాలతో అయ్యప్ప స్వాములు, భక్తులు భక్తిశ్రద్ధలతో పాల్గొన్నారు.