'మద్యం సేవించి వాహనాలు నడిపిన వారికి జరిమాన'

SRD: గుమ్మడిదల పోలీస్ స్టేషన్ పరిధిలో గత వారం డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు. మద్యం త్రాగి వాహనాలు నడిపిస్తూ పట్టుబడిన వ్యక్తులకు సోమవారం సంగారెడ్డి కోర్టులో హాజరు పరిచారు. ముగ్గురు వ్యక్తులలో ఒకరికి 2 రోజుల జైలు శిక్ష, మరో ఇద్దరికి 2వేల 2వందల రూపాయల జరిమానా న్యాయమూర్తి విధించారని గుమ్మడిదల ఎస్సై మహేశ్వర్ రెడ్డి ఒక ప్రకటనలో పేర్కొన్నారు.