పేకాట స్థావరంపై పోలీసుల దాడి.. ఐదుగురి అరెస్ట్
గుంటూరు: తెనాలిలో పేకాట స్థావరాలపై టూ టౌన్ పోలీసులు దాడులు కొనసాగిస్తున్నారు. ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో సోమవారం జరిగిన ఆకస్మిక తనిఖీలలో పేకాట ఆడుతున్న ఐదుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి రూ.4,500 స్వాధీనం చేసుకున్నారు. వారిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.