'భారంగా మారిన కుల వృత్తుల బతుకు పోరాటం'

'భారంగా మారిన కుల వృత్తుల బతుకు పోరాటం'

VKB: ఒకప్పుడు గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా నిలిచిన కమ్మరి, వడ్రంగి వంటి కులవృత్తుల వారు నేడు బతుకు పోరాటం చేస్తున్నారు. ఆధునిక యంత్రాల వినియోగం పెరగడంతో చేతి వృత్తులకు గిరాకీ తగ్గిపోయింది. కష్టపడి పనిచేసినా గిట్టుబాటు ధర లభించకపోవడంతో బతుకు భారంగా మారిందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కులవృత్తులను ప్రోత్సహించి ఆదుకోవాలని వారు కోరుతున్నారు.