రథం నిర్మాణ పనుల ప్రారంభం

రథం నిర్మాణ పనుల ప్రారంభం

NLR: ఉలవపాడు వేణుగోపాలస్వామి దేవాలయానికి సంబంధించిన నూతన రథం నిర్మించనున్నారు. కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు ఆధ్వర్యంలో బుధవారం సంబంధిత పనులకు పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎంతో చరిత్ర కలిగిన శ్రీ వేణుగోపాల స్వామివారి నూతన రథం నిర్మాణంలో పాల్గొనడం తన పూర్వజన్మ సుకృతమని చెప్పారు. అనంతరం ఆయన రథం నమూనా చిత్రాన్ని ఆవిష్కరించారు.