రాష్ట్రంలో ఎవరూ పస్తులుండొద్దు: సీఎం

రాష్ట్రంలో ఎవరూ పస్తులుండొద్దు: సీఎం

NTR: విజయవాడలోని పటమట హైస్కూల్ వద్ద తన సతీమణి భువనేశ్వరితో కలిసి సీఎం చంద్రబాబు అన్న క్యాంటీన్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రాష్ట్రంలో తినడానికి తిండి లేదని ఎవరూ బాధపడొద్దని, ఎవరూ పస్తులుండొద్దని భావోద్వేగానికి లోనయ్యారు.  రాష్ట్రంలో మొత్తం 269 అన్న క్యాంటీన్లు ఉన్నాయని, త్వరలో మరో 5 క్యాంటీన్లను ప్రారంభించబోతున్నామని వెల్లడించారు.