'సింగూర్ ప్రాజెక్ట్ నుంచి నీటిని విడుదల చేయాలి'

'సింగూర్ ప్రాజెక్ట్ నుంచి నీటిని విడుదల చేయాలి'

MDK: పంటల రక్షణ కోసం సింగూర్ ప్రాజెక్ట్ నుంచి నీటిని విడుదల చేయాలని ప్రభుత్వాన్ని మాజీ మంత్రి హరీశ్ రావు డిమాండ్ చేశారు. గురువారం మెదక్ కలెక్టరేట్ ముందు BRS ఆధ్వర్యంలో చేపట్టిన రైతు మహాధర్నాలో ఆయన మాట్లాడారు. చివరి కాలువల వరకు నీరివ్వాలన్నారు. ఈ దర్నాలో BRS జిల్లా పార్టీ అధ్యక్షురాలు పద్మా దేవేందర్ రెడ్డి, ఎమ్మెల్యేలు సునీతా రెడ్డి, ప్రభాకర్ రెడ్డి, రైతులు పాల్గొన్నారు.