ఇంటర్ పరీక్షలకి 895 మంది హాజరు
SKLM: జిల్లా వ్యాప్తంగా సోమవారం జరిగిన ఓపెన్ స్కూల్ ఇంటర్మీడియట్ పబ్లిక్ ఇంగ్లీష్ పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయని జిల్లా డీఈవో పి. రవిబాబు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ పరీక్షకు మొత్తం 1000 మంది అభ్యర్థులు నమోదు చేసుకోగా, వారిలో 895 మంది పరీక్షకు హాజరయ్యారని పి. రవిబాబు పేర్కొన్నారు. 105 మంది విద్యార్థులు పరీక్షకు గైర్హాజరైనట్లు వెల్లడించారు.