'తొక్కిసలాటను వైసీపీ రాజకీయంగా వాడుకుంటోంది'
AP: కాశీబుగ్గ తొక్కిసలాట ఘటనను వైసీపీ రాజకీయంగా వాడుకుంటోందని మంత్రి సంధ్యారాణి ఆరోపించారు. తొక్కిసలాటపై రాజకీయాలు చేయడం దుర్మార్గమని అన్నారు. బాధలో ఉన్న కుటుంబాల పట్ల వైసీపీ నేతలు అనవసర ప్రచారాలు చేయడం దారుణమని చెప్పారు. తొక్కిసలాటపై విచారణకు ఇప్పటికే ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిందని తెలిపారు. ప్రజల భద్రత తమ ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యమని పేర్కొన్నారు.