సమీక్షా సమావేశం నిర్వహించిన కమిషనర్

సమీక్షా సమావేశం నిర్వహించిన కమిషనర్

GNTR: డయల్ యువర్ కమిషనర్ కార్యక్రమానికి అందిన ఫిర్యాదులను 24 గంటల్లోగా పరిష్కరించాలని నగరపాలక సంస్థ కమిషనర్ పులి శ్రీనివాసులు అధికారులను ఆదేశించారు. మంగళవారం తన కార్యాలయంలో విభాగాధిపతులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఫిర్యాదుదారులతో నేరుగా మాట్లాడి సమస్యను పరిష్కరించాలని సూచించారు.