జిల్లాలో గాలుల బీభత్సం.. రైతులకు తీరని నష్టం
GNTR: ప్రత్తిపాడు(M)లో అకస్మాత్తుగా వీచిన భారీ గాలులు బీభత్సం సృష్టించాయి. ప్రధానంగా 5వ మైలు వద్ద భారీ వృక్షం రహదారిపై విరిగిపడటంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే చెట్టును తొలగించే పనులను ప్రారంభించారు. మరో వైపు అకాల గాలులతో మిర్చి, మామిడి, అరటి రైతులు పంటలకు నష్ట్రం జరిగిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.