అరసవల్లికి పోటెత్తిన భక్తులు

అరసవల్లికి పోటెత్తిన భక్తులు

SKLM: ఆరోగ్య ప్రదత అరసవల్లి సూర్యనారాయణ స్వామివారి దర్శనానికి ఆదివారం భక్తులు పోటెత్తారు. వైశాఖమాసం ఆదివారం కావడంతో భక్తులు పెద్ద సంఖ్యలో ఉదయాన్నే ఆలయానికి చేరుకొని స్వామివారి ఇంద్రపుష్కరిణి వద్ద క్షీరాన్నం వండి మొక్కలు చెల్లించుకున్నారు. అనంతరం స్వామివారిని దర్శించుకున్నారు. నూతన ఈవోగా విధుల్లో చేరిన శోభారాణి స్వయంగా ఏర్పాట్లను పర్యవేక్షించారు.