VIDEO: విషాదం.. మృతదేహానికి రాఖీ కట్టిన అక్క

KMM: కూసుమంచి మండలం కిస్టాపురంలో విషాద ఘటన చోటుచేసుకుంది. రెండు రోజుల్లో రాఖీ పౌర్ణమి, కానీ అంతలోనే తమ్ముడు డెంగ్యూతో మృతి చెందాడు. గుండెలదిరేలా విలపిస్తూ చనిపోయిన తన తమ్ముడి చేతికి గురువారం అక్క రాఖీ కట్టింది. 'తమ్ముడా నీ కోసం రాఖీ తెచ్చాను.. లే తమ్ముడా' అంటూ రోదిస్తూ మృతదేహానికి రాఖీ కట్టింది. ఈ ఘటన అక్కడున్న వారి హృదయాలను కలచివేసింది.