'ఎండల దృష్ట్యా ప్రజలు జాగ్రత్తలు పాటించాలి'
KKD: జిల్లాలోని 14 మండలాల్లో రానున్న 5 రోజుల పాటు అధిక ఉష్ణోగ్రతలు నెలకొంటాయని వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసిన నేపథ్యంలో ప్రజలు వేసవి ఎండలు, వడగాడ్పుల నుంచి రక్షణకు అవసరమైన జాగ్రత్తలు పాటించాలని కలెక్టర్ ఎం. ఎన్. హరేంద్ర ప్రసాద్ ప్రజలను కోరారు. 41 డిగ్రీల సెంటీగ్రేడ్ మించి ఉష్ణోగ్రతలు నమోదు కానున్నాయని, ప్రజలు అప్రమత్తతో తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సూచించారు.