పారిశుద్ధ్య నిర్వహణపై నిర్లక్ష్యం వహించకూడదు: R.V కర్ణన్

పారిశుద్ధ్య నిర్వహణపై నిర్లక్ష్యం వహించకూడదు: R.V కర్ణన్

HYD: నగరంలో పారిశుద్ధ్య నిర్వహణపై GHMC కమిషనర్ R.V కర్ణన్ క్షేత్రస్థాయిలో పర్యవేక్షిస్తున్నారు. ఇందులో భాగంగా ఇవాళ జూబ్లీహిల్స్ సర్కిల్‌ పరిసర ప్రాంతాల్లో ఆయన ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రోడ్లపై పేరుకుపోయిన నిర్మాణ వ్యర్థాలను వెంటనే తొలగించాలనీ అధికారులను ఆదేశించారు. నగరాన్ని పరిశుభ్రంగా ఉంచడంలో అధికారులు నిర్లక్ష్యం వహించకూడదని ఆయన స్పష్టం చేశారు.