సర్వేయర్ల శిక్షణ కోసం దరఖాస్తులు ఆహ్వానం: కలెక్టర్ ఇలా త్రిపాఠి

NLG: భూభారతి చట్టం-2025 అమలులో భాగంగా అర్హులైన సర్వేయర్లకు శిక్షణ ఇచ్చేందుకుగాను దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి శనివారం తెలిపారు. అర్హులైన అభ్యర్థులు సర్వేయర్ల శిక్షణ కోసం ఈ నెల 17లోగా సమీపంలోని మీసేవ కేంద్రాలలో దరఖాస్తు చేసుకోవాలని కోరారు. ఎంపికైన సర్వేయర్లకు ఈ నెల 26- జూలై 26 వరకు శిక్షణ ఇవ్వనున్నట్లు కలెక్టర్ తెలిపారు.