శిక్షణ శిబిరాలకు దరఖాస్తులు ఆహ్వానం
తిరుపతి జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో మే 1 నుంచి 31 వరకు వివిధ క్రీడల్లో శిక్షణ శిబిరాలు నిర్వహించనున్నారు. ఈ శిబిరాల నిర్వహణకు ఆసక్తి ఉన్న పీడీలు, పీఈటీలు ఈ నెల 30లోపు తిరుపతిలోని డీఎస్‌డీవో కార్యాలయానికి దరఖాస్తులు పంపాలని డీఎస్‌డీవో శశిధర్ తెలిపారు.