ఓ ఇంట్లో చోరీ.. సీసీ ఫుటేజ్ లో లేడీ దొంగ
SRD: కంగ్టి మండలం జంగి గ్రామ శివారు హనుమాన్ టెంపుల్ వద్ద ఓ ఇంట్లో చోరీ జరిగిందని ఎస్సై దుర్గారెడ్డి గురువారం తెలిపారు. అయితే అక్కడున్న సీసీ పుటేజ్ ఆధారంగా ఒక మహిళ బుధవారం సాయంత్రం ఆ ఇంట్లో వెళ్లినట్టు స్పష్టమైంది. ఆ ఇంట్లో బంగారం, నగదు దొంగతనం చేసిందన్నారు. ఎవరైనా ఈ లేడీని గుర్తు పడితే ఈ 8712656760, 8712656734 నంబర్ కాల్ చేసి చెప్పాలన్నారు.