రాష్ట్రంలో ఎక్కడైనా రేషన్ తీసుకోవచ్చు: ఎమ్మెల్యే

SKLM: రణస్థలం మండలంలోని రావాడ గ్రామంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని సోమవారం ఎచ్చెర్ల నియోజకవర్గ ఎమ్మెల్యే నడుకుదిటి ఈశ్వరరావు ప్రారంభించారు. ఈ సందర్బంగా స్మార్ట్ కార్డ్ నమూనాను ఆవిష్కరించారు. తదుపరి లబ్ధిదారులకు స్మార్ట్ కార్డ్‌లను అందించారు. రాష్ట్రంలో ఇతర ప్రాంతాలకు వలస వెళ్లినవారు ఎక్కడి నుంచైనా రేషన్ తీసుకోవచ్చన్నారు.