గణపతి ఆశీస్సులు ప్రజలపై ఉండాలి: మేయర్

గణపతి ఆశీస్సులు ప్రజలపై ఉండాలి: మేయర్

KMM: విఘ్నూలను తొలగించే ఆది దేవుడు గణపయ్య ఆశీస్సులు అందరిపై ఉండాలని మేయర్ పి.నీరజ అన్నారు. బుధవారం ఖమ్మంలోని తన నివాసంలో మట్టి వినాయకుని ప్రతిష్టించి కుటుంబ సమేతంగా తొలి పూజను భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. వినాయక చవితి మన సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక అని, విఘ్నేశ్వరుని పూజించడం ద్వారా ప్రతి ఇంటిలో శాంతి, సౌఖ్యం, అభివృద్ధి కలుగుతుందన్నారు.