రోడ్డు ప్రమాదంలో యువకుడు దుర్మరణం
SRPT: కోదాడ మండలం గుడిబండ గ్రామంలో శనివారం రాత్రి గణపవరంకు చెందిన జానీ పాషా ద్విచక్ర వాహనంపై కోదాడకు వస్తూ, రోడ్డు ప్రక్కన ఆగి ఉన్న ట్రాక్టర్ ను వెనక నుండి ఢీకొట్టాడు. ఈ ఘటనలో జానీ పాషా తలకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి తండ్రి షేక్ మౌలానా ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు ఎస్సై గోపాల్ రెడ్డి తెలిపారు.