నరసరావుపేటకు కొత్త ఆర్డీవో
PLD: నరసరావుపేట రెవెన్యూ డివిజనల్ అధికారిగా బాలకృష్ణ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా కార్యాలయ సిబ్బంది, అధికారులు ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం నూతన ఆర్డీవో మాట్లాడుతూ.. ప్రజలకు పారదర్శకంగా, వేగవంతంగా సేవలు అందించడమే లక్ష్యమని తెలిపారు.