బైక్‌ను ఢీకొన్న కారు.. వ్యక్తికి తీవ్ర గాయాలు
BHPL: కాటారం మండల కేంద్రంలోని శంకరపల్లి క్రాస్ వద్ద సోమవారం రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం.. వేగంగా వచ్చిన కారు అదుపు తప్పి ఎదురుగా వస్తున్న ఎలక్ట్రిక్ స్కూటీని ఢీకొట్టింది. ఈ ఘటనలో స్కూటీ నడుపుతున్న లింగరాజుకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు గమనించి లింగరాజును ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.