బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం

బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం

AKP: కోటవురట్ల మండలం పాములవాక గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ కొండ్రపు రాజు మృతి చెందడంతో ఆ కుటుంబానికి గ్రామ మాజీ సర్పంచ్ కే శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఆదివారం ఆర్థిక సహాయం అందించారు. శ్రీనివాసరావు ఇచ్చిన పిలుపు మేరకు గ్రామస్తులు పలువురు ముందుకు వచ్చి రూ.21,500 విరాళంగా అందజేశారు. ఈ మొత్తాన్ని శ్రీనివాసరావు, ఆ కుటుంబానికి అందజేశారు.