VIDEO: ఏడుబావుల జలపాతంలో యువకుడు గల్లంతు

MHBD: గంగారం మండలంలోని ఏడుబావుల జలపాతం వద్ద శనివారం ఖమ్మం జిల్లా ఏన్కూరు మండలానికి చెందిన ప్రేమ్ కుమార్ (25) అనే యువకుడు స్నేహితులతో వచ్చి గల్లంతయ్యాడు. చీకటి పడటంతో గాలింపు చర్యలకు ఆటంకం ఏర్పడింది. అటవీ శాఖ అనుమతి లేని ఈ జలపాతంలో యువకుడి ఆచూకీ కోసం గ్రామస్తులు గాలింపు చేపడుతున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.