'ప్రభుత్వ విద్యా సంస్థల అభివృద్ధికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలి'
SRD: సంగారెడ్డి, సదాశివపేటలోని ప్రభుత్వ విద్యా సంస్థల అభివృద్ధి ప్రతిపాదనలను ఈ నెల 25లోపు సిద్ధం చేయాలని టీజీఐఐసీ ఛైర్‌పర్సన్ నిర్మల రెడ్డి, జగ్గారెడ్డి అధికారులను ఆదేశించారు. అదనపు కలెక్టర్ పాండుతో నిర్వహించిన సమీక్షలో వారు మాట్లాడుతూ.. ఈ ప్రతిపాదనలను సీఎం రేవంత్ రెడ్డికి సమర్పించి అవసరమైన నిధులు మంజూరు చేయిస్తామని హామీ ఇచ్చారు.