సురక్షిత ఉత్పత్తులే లక్ష్యం: శ్రీదేవి
VZM: వినియోగదారులు తమ హక్కులతో పాటు బాధ్యతలను గుర్తించాలని జిల్లా వినియోగదారుల కమిషన్ సభ్యురాలు శ్రీదేవి అన్నారు. ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవం సందర్భంగా శనివారం విజయనగరం కలెక్టరేట్లో నిర్వహించిన సదస్సులో ఆమె మాట్లాడారు. ప్రతి వినియోగదారుడికి రక్షణ, సమాచారం, ఎంపిక, ఫిర్యాదు చేసే హక్కులు ఉన్నాయన్నారు.