వక్క మార్కెట్ పనులు వేగవంతం చేయాలి: కలెక్టర్
సత్యసాయి: అమరాపురం మండలం హాలుకూరులో ఏర్పాటు చేయనున్న వక్క మార్కెట్ నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ శ్యాంప్రసాద్ అధికారులను ఆదేశించారు. మంగళవారం ఎమ్మెల్యే ఎం.ఎస్. రాజుతో కలిసి ఆయన 10 ఎకరాలలో కేటాయించిన స్థలాన్ని పరిశీలించారు. స్థానికులు, అధికారుల నుంచి మార్కెట్ ఏర్పాటుపై వివరాలు అడిగి తెలుసుకున్నారు.