సుధీర్ 'గోట్' టీజర్ రిలీజ్
సుడిగాలి సుధీర్ హీరోగా నటిస్తున్న చిత్రం 'గోట్'. క్రికెట్ నేపథ్యంతో కూడిన కామెడీ డ్రామాగా ఈ సినిమా రూపుదిద్దుకుంటోంది. తాజాగా, మేకర్స్ ఈ సినిమా టీజర్‌ను విడుదల చేశారు. ఇందులో సుధీర్‌కు జోడీగా దివ్యభారతి నటిస్తోంది. లియోన్ జేమ్స్ సంగీతం, మణిశర్మ BGMను అందిస్తున్నాడు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి.