చినమట్లపూడిలో 'రైతన్న మీకోసం'
BPT: నగరం మండలం చినమట్లపూడిలో బుధవారం 'రైతన్న మీకోసం' కార్యక్రమం జరిగింది. స్థానిక రైతు సేవా కేంద్రంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో రేపల్లె ఆర్డీవో రామలక్ష్మి పాల్గొన్నారు. రైతులతో కలిసి ఆమె ముచ్చటించారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని, వ్యవసాయ అధికారుల సూచనలు పాటించాలని రైతులకు సూచించారు.