క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న నలుగురిని పట్టుకున్న విశాఖ పోలీసులు

విశాఖ సీపీ ఆదేశాలు మేరకు క్రికెట్ ఆన్లైన్, ఆఫ్‌లైన్ బెట్టింగ్‌లు నిర్వహిస్తున్న నలుగురిని విశాఖ పోలీసులు శుక్రవారం రాత్రి అరెస్ట్ చేసి రిమాండ్‌కి పంపించారు. విశాలాక్షీ నగర్ జోడుగుళ్ల పాలెంలో సైబర్ పోలీసులు తనిఖీలు చేసి వీరిని పట్టుకున్నారు. వీరు మధురవాడ, ఆదర్శ్ నగర్, చిన్నగదిలి, శివాజీ పాలెంకు చెందిన వారని పోలీసులు తెలిపారు.