జడ్చర్లలో బీఆర్ఎస్ పార్టీకి షాక్

MBNR: జిల్లాలో బీఆర్ఎస్ పార్టీకి షాక్ తగిలింది. జడ్చర్ల మున్సిపల్ ఛైర్మన్ పుష్పలత శుక్రవారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి కండువా కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. జడ్చర్ల అభివృద్ధి కోసం అనిరుధ్ రెడ్డి చేపట్టిన పనులు బాగా నచ్చాయని, గత ప్రభుత్వాలతో పోలిస్తే ఎక్కువ నిధులు వస్తాయన్నారు.