అధికారంలోకి రాగానే వారిని తరిమి కొడతాం: అమిత్ షా
అసోం ఎన్నికల ప్రచారంలో భాగంగా కేంద్రమంత్రి అమిత్ షా అక్రమ చొరబాటుదారులపై మండిపడ్డారు. బెంగాల్‌లో అభివృద్ధి జరగాలన్నా, అక్రమ చొరబాటుదారులను తరిమి కొట్టాలన్నా అది బీజేపీ వల్లే సాధ్యమవుతుందని చెప్పారు. బీజేపీ అధికారంలోకి వస్తేనే ఇవన్నీ జరుగుతున్నాయని వెల్లడించారు. ఒక్కసారి తాము అధికారంలోకి రాగానే రాష్ట్రంలో మార్పు మొదలువుతుందన్నారు.