హనుమాన్ జయంతి వేడుకలలో పాల్గొన్న ఎస్సై
NRPT: నర్వ మండలంలోని పెద్ద కడుమూరు వీరాంజనేయ స్వామి దేవాలయంలో హనుమాన్ జయంతి వేడుకలు భక్తిశ్రద్ధలతో జరిగాయి. ఎస్సై రమేష్ హాజరై స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ పూజారి ప్రవీణ్ ఎస్సైని శాలువాతో సన్మానించి తీర్థప్రసాదాలు అందజేశారు. హనుమాన్ జయంతి పర్వదినం ప్రజలందరి జీవితాల్లో సుఖశాంతులు నింపాలని ఎస్సై ఆకాంక్షించారు.