టవల్ ఆరేస్తూ విద్యుత్ షాక్.. మహిళ మృతి

టవల్ ఆరేస్తూ విద్యుత్ షాక్.. మహిళ మృతి

WGL: వర్ధన్నపేట మండలంలోని ఇల్లంద గ్రామంలో విషాద ఘటన చోటుచేసుకుంది. ఉర సమ్మక్క (45) అనే మహిళ ఇవాళ ఉదయం ఇంటి ఎదుట దండం‌పై టవల్ ఆరేస్తుండగా అకస్మాత్తుగా విద్యుత్ షాక్‌కు గురైంది. తీవ్ర గాయాలపాలైన ఆమెను వెంటనే వర్ధన్నపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ ఘటనతో గ్రామంలో విషాద వాతావరణం నెలకొంది.